Telugu Gateway
Telangana

ఏపీ ముందుకెళ్లకుండా అడ్డుకోండి

ఏపీ ముందుకెళ్లకుండా అడ్డుకోండి
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203పై ముందుకెళ్ళకుండా అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ బుధవారం నాడు కృష్ణా బోర్డు ఛైర్మన్ ను కోరారు. ఇఫ్పటికే లేఖ రాసిన సర్కారు..వ్యక్తిగతంగా కూడా బోర్డు ఛైర్మన్ ను కలసి ఫిర్యాదు చేసింది. ఏపీ సర్కారు తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని రజత్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్ళినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

ఏపీ సర్కారు ఎన్నిసార్లు చెప్పినా కూడా పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయలేదని రజత్ కుమార్ తెలిపారు. నీటి పర్యవేక్షణకు ఎలాంటి విధానం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు కూడా తాత్కాలికమే అని వెల్లడించారు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో ఇప్పటికే ట్రిబ్యునల్స్ లో కేసు నడుస్తోందని తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నందున 575 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నట్లు రజత్ కుమార్ వివరించారు.

Next Story
Share it