Telugu Gateway
Cinema

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’
X

హీరో మహష్ బాబు ఈ సారి వెరైటీ టైటిల్ తో ముందుకు రాబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాకు ‘సర్కారు వారి పాట’ టైటిల్ ను ఖరారు చేశారు. చిత్ర యూనిట్ ఆదివారం నాడు అధికారికంగా టైటిల్ లుక్ ను విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి, ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ కొత్త సినిమాను మైత్రీ మూవీమేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

చెవికి రింగు..మెడపై టాటూ..డిఫరెంట్ స్టైల్ లో మహేష్ బాబను చూపించారు టైటిల్ పోస్టర్ లో. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించే భామ ఎవరు..ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. భరత్ అనే నేనులో మహేష్ బాబుకు జోడీగా నటిచింన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఇందులో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతో తేలాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Next Story
Share it