ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం

అందరూ పొలం పనులకు వెళ్ళారు. మిరప పొలంలో పని చేశారు. ఇంకా కొద్దిసేపటిలో ఇంటికి వెళ్ళటమే. పని పూర్తి కాగానే ట్రాక్టర్ లో బయలుదేరారు. కానీ ఊహించని పరిణామం. కూలీలు ఎక్కిన ట్రాక్టర్ ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అంతే ఊహించని పరిణామంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో స్తంబం ట్రాక్టర్ పై పడటంతో కలకలం. ఈ ఘటనలో ఏకంగా పది మంది మృత్యువాతపడ్డారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి కారణం అతి వేగంతో పాటు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాదంపై ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.