ఈ టర్మ్ లో ప్రత్యేక హోదా సంగతి అంతేనా?

స్పష్టమైన సంకేతాలు ఇఛ్చిన జగన్!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ మాట చెప్పకపోయినా ఈ అంశంపై అదే రకమైన సంకేతాలు మాత్రం స్పష్టంగా ఇచ్చేశారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పరిశ్రమల రాయితీలు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేవి. కేంద్ర ప్రభుత్వం రాయితీల భారంలో షేర్ చేసి ఉండేది. ఎక్కువ భారం కేంద్రమే తీసుకునే పరిస్థితి ఉండేది. ఇన్ కం ట్యాక్స్ మినహాయింపులు, జీఎస్టీ మినహాయింపులు ఇటువంటి అనేకంగా వచ్చి ఉండేవి. వాటి వల్ల పరిశ్రమలకు ఇంకా ప్రోత్సాహం ఎక్కువ ఉండేది. దురదృష్టవశాత్తూ 2014 నుంచి 2019 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేసినా కూడా ప్రత్యేక హోదాను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడి దయతో 22 ఎంపీ సీట్లు గెలిచాం. 175 అసెంబ్లీలో 151 సీట్లు గెలిచాం. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళకు సపూర్ణమైన మెజారిటీ రాకపోయింటే.. మెజారిటీ సగంలో ఆగిపోయి ఉంటే రాష్ట్రం ప్రయోజనం పొంది ఉండేది. మనం బేరం ఆడుకునే పరిస్థితి ఉండేది. ఎవరు ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వాళ్లతో వెళతామని చెప్పాం. కానీ దురదృష్టవశాత్తూ అది కూడా జరగలేదు.
కారణంగా ఏంటి అంటే మన అవసరం పడకుండా వాళ్ళకు పూర్తి మెజారిటా వచ్చింది. ‘ఈ రోజు కాకపోయినా రేపు అయినా మన అవసరం వస్తుంది. కేంద్రం మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. వచ్చిన రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేం మద్దతు ఇస్తాం అని సంపూర్ణంగా అని చెప్పే మన ఆలోచన ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకుని వస్తాం. అప్పుడు స్పెషల్ స్టేటస్ కేటరిగి అన్నది ఎప్పుడో ఓ సారి రియలైజ్ అవుతుంది.’ అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా లేకపోయినా కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళేందుకు మనం ఏమి చేయగలగాలో అది చేయాలన్నారు. రాజ్యసభలో బిజెపి ప్రభుత్వానికి విపక్షాల మద్దతు అవసరం అయినా అది కూడా మేనేజ్ చేసుకునే స్థితిలో ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా అసలు కేంద్రంలోని ప్రభుత్వం ‘ప్రత్యేక హోదా’ పేరెత్తితేనే మండిపడుతోంది. అది ముగిసిపోయిన అధ్యాయం అని స్పష్టం చేస్తోంది. మరి సీఎం జగన్ కేంద్రం మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది..అప్పుడు హోదా సాధిస్తాం అంటే అది కనీసం ఈ నాలుగేళ్లలో జరిగే పనికాదని ఎవరైనా అంచనా వేయగలరు.