Telugu Gateway
Andhra Pradesh

రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు

రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు
X

టారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు

‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్ టారిఫ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కావాలనే ప్రతిపక్షాలు విద్యుత్ ఛార్జీల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నాయి. శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తోంది’ అని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది. జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అవకాశం కల్పించాం.

ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కరెంట్ బిల్లులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్ రీడింగ్ రెండు నెలలు తీయక పోవడంతోనే టారిఫ్ శ్లాబ్ మారడంతో కరెంట్ బిల్లులు పెరిగాయి. ఏపీ ఈఆర్సీ డైనమిక్ పద్ధతి అమలులోకి తీసుకు వచ్చాం. వచ్చే నెల బిల్లులు చూస్తే ఛార్జీల్లో పెరుగుదల లేదనే విషయం అర్ధం అవుతుందని తెలిపారు. డిస్కంలు ఏమైనా పొరపాటు పడ్డాయా అనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నట్లు బుగ్గన తెలిపారు.

Next Story
Share it