ఏపీలో 1525కి పెరిగిన కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో కల్లోలం ఆగటం లేదు. ఇరవై నాలుగు గంటల్లో అక్కడ కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీలోనే అత్యధిక కేసుల ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. ఇప్పుడు అక్కడ మొత్తం 436 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్తగా 62 కేసులు వెలుగుచూడగా కర్నూలులో 25, కృష్ణాలో 12, అనంతపురంలో 4, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, కడపలో 4, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో ఒక కేసు నమోదు అయ్యాయి. 24 గంటల్లో మొత్తం 5942 మందికి పరీక్షలు చేయగా, అందులో 62 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
కర్నూలు తర్వాత 308 కేసులతో గుంటూరు రెండవ స్థానంలో నిలిచింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 38 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 441 కు చేరుకుందని తెలిపారు. వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది.