Telugu Gateway
Andhra Pradesh

ప్రచారం పీక్ అనుకునే చంద్రబాబు కూడా ఇలా చేయలేదుగా!

ప్రచారం పీక్ అనుకునే చంద్రబాబు కూడా ఇలా చేయలేదుగా!
X

ప్రభుత్వ యాడ్స్ లో ‘జగనన్న ప్రభుత్వం’ అంటూ కొత్త పోకడ

సర్కారు తీరుపై అవాక్కు అవుతున్న అధికారులు

ప్రభుత్వం శాశ్వతం. ప్రతి ఐదేళ్ళకు ఓ సారి పాలకులు మారుతుంటారు. సహజంగా ఎవరు అధికారంలో ఉంటే ఆ సమయంలో మాట్లాడుకునేటప్పుడు....పత్రికల్లో జగన్ సర్కారు..చంద్రబాబు సర్కారు అని రాస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఓ పద్దతి. కానీ ఓ ప్రభుత్వమే అధికారంగా ఇచ్చిన పత్రికా ప్రకటనలో ‘జగనన్న ప్రభుత్వం’ అని పేర్కొనటం అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఉండేది ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ ఏకంగా పత్రికల్లో ఇచ్చే యాడ్స్ లోనూ ఇలా జగనన్న ప్రభుత్వం అని పేర్కొనటం ఏ మాత్రం సరికాదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన యాడ్స్ లో ఇంత వరకూ జగనన్న ప్రభుత్వం అంటూ పేర్కొంటూ వచ్చిన సర్కారు తాజాగా తెలుగు పత్రికలకు ఇచ్చిన యాడ్స్ లోనూ ‘జగనన్న ప్రభుత్వం’ అని పేర్కొనటం విశేషం. ప్రచారం పీక్ లో చేసుకుంటారని పేరున్న చంద్రబాబు జమానాలో కూడా ప్రభుత్వ యాడ్స్ లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

కాకపోతే చంద్రబాబు జమానాలో పలు ప్రభుత్వ పథకాలకు ‘చంద్రన్న’ పేరు తగిలించిన విషయం తెలిసిందే. కానీ అప్పటి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా పలు ప్రభుత్వ పథకాలకు ‘జగనన్న’ పేరు తగిలించారు. ఏడాది కాలంలోనే ఇప్పటికే ఏడు స్కీమ్ లకు జగనన్న పేరును యాడ్ చేశారు. అసలు తమకు ప్రచారమే ఇష్టం ఉండదని..తాము ప్రచారానికి చాలా దూరం అని చెప్పుకుంటూ ఏకంగా ఏడు స్కీమ్ లకు జగనన్న పేరు తగిలించటం విశేషం. అంతే కాదు..ఇప్పుడు ఏకంగా పత్రికా ప్రకటనల్లోనూ ఏకంగా ప్రభుత్వానికే జగనన్న ప్రభుత్వం అని పేర్కొనటంపై అధికారులే అవాక్కు అవుతున్నారు. ఏపీలో అర్చకులు, ఇమామ్ లు, పాస్టర్లకు ఉపశమనంగా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున అందించే స్కీమ్ యాడ్ లోనే జగనన్న ప్రభుత్వం అని పేర్కొన్నారు.

Next Story
Share it