Telugu Gateway
Andhra Pradesh

మందు బాబులకు ఏపీ సర్కార్ షాక్

మందు బాబులకు ఏపీ సర్కార్ షాక్
X

ఓ వైపు సోమవారం నాడు మందు అందుబాటులోకి వస్తుందన్న ఆనందం ఓ వైపు. ఈ ఆనంద సమయంలో ఏపీ సర్కారు వారికి షాక్ ఇచ్చింది. అసలే మందుబాబులు రాష్ట్రంలో తాము కోరుకున్న బ్రాండ్లు కాకుండా సర్కారు ఏవేవో బ్రాండు పెడుతుందంటూ ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో సర్కారు ఏకంగా మద్యం దరలను 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలే సోమవారం నుంచి అమల్లో ఉంటాయని ప్రకటించింది. ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కారు ఇది మధ్య నియంత్రణకే అని చెబుతోంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్యను మరింత తగ్గించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 4 నుంచి మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు.

Next Story
Share it