Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మరో 58..కర్నూలులోనే 30 పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 58..కర్నూలులోనే 30 పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో మరో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 30 కేసులు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ప్రతి రోజూ కూడా రాష్ట్రంలో నమోదు అయ్యే కేసుల్లో ఈ జిల్లాలోనే సింహభాగం ఉంటున్నాయి కొత్తగా వచ్చిన 30 కేసులు కలుపుకుంటే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 466కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అనంతపురంలో 7, చిత్తూరులో 1, గుంటూరులో 11, కృష్ణాలో 8, నెల్లూరులో 1 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

తాజాగా వచ్చిన 58 కేసులు కలుపుకుంటే ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1583కు పెరిగింది. ఇప్పటికే 488 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులు 1062. కరోనా కారణం మరణించిన వారి సంఖ్య 33 మంది. కర్నూలు తర్వాత 319 పాజిటివ్ కేసులతో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది.

Next Story
Share it