కర్నూలు లెక్క ఆగేది ఎప్పుడు?
BY Telugu Gateway5 May 2020 11:39 AM IST

X
Telugu Gateway5 May 2020 11:39 AM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల లెక్క ఆగేది ఎప్పుడు?. ఇప్పుడు ముఖ్యంగా ఆ జిల్లా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 25 కేసులు ఆ జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. అంతకు ముందు ఇంత కంటే ఎక్కువే నమోదు అయినా..వరసగా రోజుకు 25 కేసులు లెక్కన రావటం విశేషం. ఏపీలోనే అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 67 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య1717కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 589 మంది డిశార్చి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారు 1094 మంది. కర్నూలు 25, తర్వాత గుంటూరులో కొత్తగా 13, కృష్ణాలో 8, ఇతరులు 14 మంది ఉన్నారు. ఈ 14 మంది గుజరాత్ కు చెందిన వారు అని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. కర్నూలులో మొత్తం కేసుల సంఖ్య 516కు పెరిగింది.
Next Story