Telugu Gateway
Latest News

గుడ్ న్యూస్...మే 12 నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభం

గుడ్ న్యూస్...మే 12 నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభం
X

ప్రయాణికులకు శుభవార్త. క్రమకమంగా ప్రయాణికుల రైళ్ళు నడిపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. మే 12 నుంచి ప్రయాణికుల రైల్వే సేవలను ప్రారంభించనుంది. అయితే వీటిని ప్రత్యేక రైళ్ళుగా పరిగణించనున్నట్లు వెల్లడించారు. ఈ రైళ్ళ అన్నీ న్యూఢిల్లీ నుంచి మొదలై డిబ్రూఘర్,భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగుళూరు, చెన్నయ్, తిరువనంతపురం, మడ్గాన్, ముంబయయ్ సెంట్రల్, అహ్మాదాబాద్, జమ్మూ తావికి వెళతాయి. ఆ తర్వాత మరిన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు మొదలవుతాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కోచ్ ల అందుబాటును బట్టి వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ కోచ్ లుగా రైల్వే శాఖ 20 వేల కోచ్ ల ను కేటాయించింది. దీంతోపాటు ప్రతి రోజూ 300 శ్రామిక్ రైళ్ళ నిర్వహణకు అవసరమైన కోచ్ లను కూడా సిద్ధంగా ఉంచారు. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ద్వారానే టిక్కెట్లు లభిస్తాయి.

టిక్కెట్లు సోమవారం అంటే మే 11 సాయంత్రం 4 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసే ఉంటాయని స్పష్టం చేశారు. ఫ్లాట్ ఫాం టిక్కెట్లు కూడా ఉండవు. కేవలం ప్రయాణానికి అర్హమైన టిక్కెట్ ఉన్న వారిని మాత్రమే రైల్వే స్టేషన్ లోకి అనుమతిస్తారు. ప్రతి ఒక్క ప్రయాణికుడు ఫేస్ కవర్ చేసుకోవటం తప్పనిసరి, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. రైళ్లు షెడ్యూల్ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. త్వరలోనే ప్రజా రవాణా కూడా స్టార్ చేస్తామని కేంద్ర మంత్రులు చెప్పిన ప్రకటనలు అమల్లోకి వస్తున్నాయి.

Next Story
Share it