Telugu Gateway
Andhra Pradesh

విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో

విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో
X

ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు ప్రారంభం అవుతున్నా విజయవాడ, విశాఖపట్నాల్లో సిటీ బస్సులు నడపటం లేదు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని దూర ప్రాంతాలకే సర్వీసులు ప్రారంభిస్తున్నామని..అంతర్ రాష్ట్ర సర్వీసులు ఆయా రాష్ట్రాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బస్సుల్లో కండక్టర్ ఉంటే సూపర్ స్ప్రెడరుగా ఉంటారని తమ అధ్యయనంలో తేలిందని ప్రతాప్ తెలిపారు. అందుకే ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ బుకింగ్ విధానం మంచి పద్దతి అనే సూచనలు వచ్చాయి. ఆర్టీసీలో కొన్నాళ్లపాటు ఆన్ బోర్డ్ కండక్టర్లు ఉండరు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల రీ-ఆరేంజ్మెంట్ ద్వారా భౌతిక దూరం పాటించేలా చర్యలు. బస్సెక్కాలంటే మాస్కులు తప్పనిసరి చేస్తాం. బస్సులెక్కే ముందు పూర్తి శానిటైజేషన్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆర్టీసీ బస్ టిక్కెట్ల విషయంలో నగదు రహిత లావాదేవీలకు వీలైనంత వరకు ప్రయార్టీ. అన్ని బస్సులకు ఆన్ లైన్ సౌకర్యం. ఆన్ లైనులో కరెంట్ బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు వసూలు చేయకూడదని నిర్ణయం. 65 ఏళ్లు దాటిన వారు.. పదేళ్ల లోపు పిల్లలను అత్యవసరమేతేనే బస్సుల్లో ప్రయాణించాలి.

ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేయడం తప్పని సరి చేస్తున్నాం. టిక్కెట్ బుకింగ్ ద్వారా వచ్చే డేటాను 15 రోజులపాటు స్టోర్ చేస్తాం. కాంటాక్ట్ ట్రేసింగుకు.. అలెర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గురువారం 1683 బస్సులు రేపు రొడ్డెక్కనున్నాయి. దశలవారీగా బస్ సర్వీసులు పెంచుతాం. అన్ని డిపోల్లో బస్సులు నడుస్తాయి. రాయితీ పాసులను ప్రస్తుతం అనుమతించడం లేదు. అవసరమైతేనే ఏసీ బస్సులు నడపాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఏసీ బస్సుల్లో దుప్పట్లు ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి పలుకుతాం. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కుదింపు ఉంటుందని తెలిపారు.

Next Story
Share it