Telugu Gateway
Politics

రేవంత్ తప్ప ఎవరైనా ఓకే

రేవంత్ తప్ప ఎవరైనా ఓకే
X

కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పీసీసీ లొల్లి మొదలైంది. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసలు మార్చాల్సిన అవసరం ఏముంది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తప్ప ఎవరైనా ఓకే అని వ్యాఖ్యానించారు. రేవంత్ కు పదవి ఇవ్వొద్దని చెబుతానని..తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ‘నన్ను అడగకుండా రేవంత్ కి పీసీసీ ఇస్తే... నా రాజకీయం నాకు ఉంటుంది. నాకు కొత్త ఆలోచన ఉంది. రేవంత్ మీద అనుమానాలు ఉన్నాయి నాకు. రేవంత్ కే ఆ విషయాలు చెప్తా.

ఉత్తమ్ తన భార్యను గెలిపించుకోలేదు కాబట్టి అన్ ఫిట్ అనేది రేవంత్ వర్గం చేసిన ప్రచారం. అందరిని గెలిపిస్తా అని తిరిగిన రేవంత్... ఆయనే ఓడిపోయాడు కదా ?. రేవంత్ సోషల్ మీడియా టీం దానికి ఏమంటారు..? . కాంగ్రెస్ లో చాలా మంది ప్రభుత్వ కోవర్టులు ఉన్నారు. పార్టీ ఇంఛార్జీ కుంతియా చుట్టే కొందరు కోవర్టులు ఉన్నారు. మా అమ్మియి జయారెడ్డి కి రాజకీయాలు ఇష్టం లేదు . కానీ పరిస్థితి ని బట్టి జయారెడ్డి ని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నా. నాపై రాజకీయ కక్షసాధింపుకు దిగితే... నా కూతురు రాజకీయాల్లో ఉంటది. జగ్గారెడ్డి కంటే గట్టిగా కొట్లాడుతుంది నా బిడ్డ’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it