Telugu Gateway
Andhra Pradesh

ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?

ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?
X

కరోనా సమయంలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ధర్మాసనం అభిప్రయాపడింది. లాక్‌డౌన్‌ను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే.. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారే పాటించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్ధిదారులతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇలా జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్‌ వాదించారు. ప్రభుత్వం తరపున వివరాలు అందజేయడానికి ఏజీ సమయం అడిగారు.

ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారని హైకోర్టులో న్యాయవాది ఇంద్రనీల్‌ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శ్రీదేవిపై కూడా న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. వీడియోలు, ఫోటోలను పిటిషనర్ కోర్టుకు అందజేశారు. ఇప్పటికే కోర్టు పలువురికి నోటీసులు జారీ చేసింది.

Next Story
Share it