Telugu Gateway
Telangana

రిలయన్స్ కంటే ఈనాడే బెటర్..కోతల్లేకుండా వేతనాలు

రిలయన్స్ కంటే ఈనాడే బెటర్..కోతల్లేకుండా వేతనాలు
X

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా కరోనా పేరు చెప్పి జీతాలు తగ్గించింది. ప్రతి ఏటా వందల కోట్ల లాభం ఆర్జించే దేశంలోని అగ్రశ్రేణి మీడియా గ్రూప్ అయిన టైమ్స్ గ్రూప్ లోనూ వేతనాల్లో కోతలు వేశారు. అంతే కాదు పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించారు. ఈ కీలక తరుణంలో దేశంలోనే టాప్ టెన్ పత్రికల్లో ఒకటైన ఈనాడు సంస్థ తొలిసారి జీతాలు ఆలశ్యం చేయటంతో తెలుగు మీడియాలో ఒకింత కలకలం చెలరేగింది. వేతనాల్లో కోత వేసేందుకే ఇలా చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈనాడు ఏప్రిల్ నెలకు సంబంధించి ఎలాంటి కోతలు లేకుండా శుక్రవారం నాడు ఉద్యోగులు అందరికీ పూర్తి వేతనాలు వేసింది. దీంతో ఈనాడులోని వేలాది మంది ఉద్యోగులు అందరూ ఊఫిలిపీల్చుకున్నారు. నిజంగా కరోనా సాకు చెప్పి వేతనాల్లో కోత పెట్టదలచుకుంటే ఈనాడును ఆపేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అంతే కాదు..మూడు నెలల కాలానికే గత కొన్ని సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయల లాభం సాధిస్తున్న రిలయన్స్ లాంటి కంపెనీనే జీతాల్లో కోత పెడితే ఎవరైనా దీన్ని సాకుగా చూపించి వాడుకోవచ్చు.

అందులో మీడియాలో ఏటా వందల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న టైమ్స్ గ్రూప్ కూడా వేతనాలను తగ్గించింది. ఇవి అన్నీ కళ్ళ ముందు ఉన్నా ఈనాడు మాత్రం పూర్తి వేతనాలకే మొగ్గుచూపింది. కాకపోతే ఈ సంస్థ కూడా ఇప్పటికై పదవి విరమణ చేసి కన్సాలిడేటెడ్ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. గత రెండు నెలలకు పైగా కరోనా కారణంతో పత్రికలకు ప్రకటనలు పూర్తి స్థాయిలో నిలిచిపోయిన మాట వాస్తవమే అయినా..మీడియా సంస్థలు కూడా పత్రికల్లో పేజీలను అనూహ్యంగా తగ్గించి..ఉద్యోగులను తొలగించి ఎంతో కొంత ఆదాకు దిగిన విషయం తెలిసిందే.

Next Story
Share it