దిల్ రాజు పెళ్లి
‘ప్రపంచమే ఎక్కడికి అక్కడ ఆగిపోయింది. వృత్తిపరంగా పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. వ్యక్తిగతంగా నాదీ అదే పరిస్థితి. త్వరలోనే పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయని..అందరూ బాగుంటారని ఆశిస్తున్నా. వ్యక్తిగతంగా నా జీవితంలో కొత్త చిగురు తోడగబోతోందని.. సంతోషకరంగా నా వ్యక్తిగత జీవితాన్ని పున: ప్రారంభిస్తున్నాను’ అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండవ పెళ్ళి చేసుకుంటారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం అని తేలిపోయింది.
ఆదివారం సాయంత్రం దిల్ రాజు నిజామాబాద్ లో నిర్మించిన దేవాలయంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకోబోతున్నారని తేలిపోయింది. దిల్ రాజు పెళ్ళి విషయంలో ఆయన కుమార్తె మందు నుంచి చొరవ తీసుకుని..తండ్రిని పెళ్ళికి ఒప్పించారని చెబుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఈ వివాహనాకికి 10 నుంచి 20 మంది కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకాకున్నట్టుగా సమాచారం. దిల్ రాజు సతీమణి అనిత 2017లో అనారోగ్యంతో కన్నుమూశారు. దిల్ రాజుకు ఏకైక కుమార్తె హన్షిత కు 2014లో అర్చిత్ రెడ్డితో వివాహం అయింది. ప్రస్తుతం హన్షిత తండ్రితో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బాధ్యతలు చూస్తున్నారు.