Telugu Gateway
Politics

ట్రంప్ పై ఒబామా తీవ్ర విమర్శలు

ట్రంప్ పై ఒబామా తీవ్ర విమర్శలు
X

అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. కరోనాను నియంత్రించటంలో విఫలమయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం తనంత అత్యుత్తమంగా ఎవరూ చేయలేరని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఓ సారి కరోనా విషయంలో ట్రంప్ పై విమర్శలు చేసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి మండిపడ్డారు. ఓ కాలేజీలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష వంటి అంశాలను లేవనెత్తారు.

75,000 మందికి పైగా అమెరికన్ల ప్రాణాలను తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు లేవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో డొనాల్డ్‌ ట్రంప్‌ దారుణంగా విఫలమయ్యారంటూ ఒబామా విరుచుకుపడ్డారు. దేశంలో అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 23న జార్జియాలో 25ఏళ్ల అహ్మద్‌ ఆర్బెరిని కాల్చి చంపిన ఘటనని గుర్తు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ ఒబామా విమర్శలు చేశారు.

Next Story
Share it