Telugu Gateway
Andhra Pradesh

జులై10 నుంచి ఏపీ పదవ తరగతి పరీక్షలు

జులై10 నుంచి ఏపీ పదవ తరగతి పరీక్షలు
X

కరోనా కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కారు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అంతే కాదు..పేపర్ల విషయంలో కూడా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలకు సంబంధించి తాజాగా హాల్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. పదవి తరగతి పరీక్షలకు 2009 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పరీక్షల నిర్వహణ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం 6.39 లక్షల మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)

జులై 11న సెకండ్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)

జులై 12న ఇంగ్లీషు(9.30am- 12.45pm)

జులై 13న మ్యాథ్స్‌(9.30am- 12.45pm)

జులై 14న జనరల్ సైన్స్(9.30am- 12.45pm)

జులై 15న సోషల్ స్టడీస్‌(9.30am- 12.45pm)

Next Story
Share it