Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఏపీ సర్కారు కీలక నిర్ణయం
X

పెద్ద ఎత్తున మద్యం రేట్లు పెంచి విమర్శల పాలైన ఏపీ సర్కారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిన సర్కారు మరోసారి ఈ దిశగా చర్యలు తీసుకుంది. కొత్తగా 13 శాతం మేర మద్యం షాపులను తగ్గించారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించారు.

గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించింది. తాజాగా మరో 13 శాతం షాపులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది.

Next Story
Share it