ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు సర్కారు రెడీ అయింది. కంటైన్ మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాల నిర్వహాణకు కసరత్తు ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న లాక్ వెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అన్ని రకాల దుకాణాల తెరిచే ఉంచేలా సడలింపు ఇవ్వనున్నారు.
సరి బేసి సంఖ్యలో దుకాణాలు విభజించి కార్యాకలాపాల నిర్వహాణకు ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం. ప్రభుత్వం సూచించే విధంగా దుకాణాలను క్రమపద్దతిలో తెరుచుకునేలా చూసే బాధ్యతలను స్థానిక కార్పోరేషన్లు మున్సిపాల్టీలకు అప్పగించారు. కేంద్ర సూచనల మేరకు సొంత వాహానాల నియంత్రణకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు.