Telugu Gateway
Andhra Pradesh

భూముల అమ్మకానికి ఇది సరైన సమయమా?

భూముల అమ్మకానికి ఇది సరైన సమయమా?
X

బిల్డ్ ఏపీ మిషన్..భూముల వేలం ద్వారా 208 కోట్ల టార్గెట్

దేశమంతా..దేశమే కాదు..ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా తో అల్లకల్లోలం అవుతోంది. అసలు దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగం కోలుకోవటానికి ఏడాది పడుతుందా..రెండేళ్ల పడుతుందా తెలియని అనిశ్చితి. ఆర్ధిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంది. ఈ తరుణంలో ఎవరైనా భూములు అమ్ముతారా?. సహజంగా అయితే ఎవరైనా ఇప్పుడు అమ్మకానికి పెట్టరు. కొనుగోలుకు సంస్థలూ ముందు రావు. కానీ ఏపీ సర్కారు అనూహ్యంగా కరోనా సంక్షోభ సమయంలో భూముల అమ్మకానికి దిగింది. ఈ భూముల అమ్మకంపై ప్రభుత్వం ఎప్పుడో విధాన నిర్ణయం తీసుకుంది. ఇందులో తప్పొప్పుల సంగతి పక్కన పెడితే ఈ భూముల అమ్మకానికి ఎంచుకున్న టైమింగ్ పై మాత్రం అధికార వర్గాలు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో అసలు ఎవరు భూములు కొనుగోలుకు ఎవరు ముందుకు వస్తారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి ఏమి అవుతుందో. ఏపీ సర్కారు ఈ భూముల అమ్మకానికి సంబంధించి బుధవారం నాడు ఓ ప్రకటన చేసింది. సర్కారు మొదటి విడతలో విశాఖ, గుంటూరుల్లో తొమ్మిది చోట్ల భూములు అమ్మాలని నిర్ణయించింది.

ఈ నెల 29వ తేదీన గుర్తించిన రాష్ట్రంలో తొమ్మిది ప్రాంతాల్లోని భూములను ఈ ఆక్షన్‌ ద్వారా వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయంతో నవరత్నాలు, నాడు-నేడు వంటి ప్రభుత్వ పథకాలకు నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ భూముల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరెక్టర్ తెలిపారు. వేలం వేయాలనుకున్న తొమ్మిది భూములకు మొత్తం రిజర్వ్ ధరగా రూ. 208.62 కోట్లుగా నిర్ణయించారు. గుంటూరు నల్లపాడు, శ్రీనగర్ కాలనీల్లో రెసిడెన్షియల్ ప్రాంతాల్లో, మెయిన్ రోడ్లో కమర్షియల్ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ భూమిని వేలం వేయనున్న బిల్డ్ ఏపీ మిషన్. విశాఖ చినగడ్లీలో రెసిడెన్షియల్ ప్రాంతం, అగనంపూడిలో రీ-క్రియేషన్ భూమి, ఫకీర్ టకియాలో ఎస్ఈజెడ్ భూముల వేలం.

వేలం వేసే భూముల వివరాలు

గుంటూరు సిటీ

నల్లపాడు- 6.07 ఎకరాలు

రిజర్వ్ ధర: రూ. 16. 96 కోట్లు.

శ్రీనగర్ కాలనీ- 5.44 ఎకరాలు

రిజర్వ్ ధర: రూ. 75.41 కోట్లు.

మెయిన్ జీటీ రోడ్- 1.72 ఎకరాలు

రిజర్వ్ ధర: రూ. 67.36 కోట్లు.

విశాఖ జిల్లా

చిన గడ్లీ- 1 ఎకరం

రిజర్వ్ ధర: రూ. 16.64 కోట్లు.

చినగడ్లీ- 75 సెంట్లు.

రిజర్వ్ ధర: రూ. 14.47 కోట్లు.

అగనంపూడి- 50 సెంట్లు

రిజర్వ్ ధర: రూ. 3.25 కోట్లు.

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 1.04 ఎకరాలు

రిజర్వ్ ధర: రూ. 4.67 కోట్లు

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 35 సెంట్లు.

రిజర్వ్ ధర: రూ. 1.47 కోట్లు

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 1.93 ఎకరాలు

రిజర్వ్ ధర: రూ. 8.39 కోట్లు

Next Story
Share it