ఏపీలో మరో 52 కేసులు
BY Telugu Gateway18 May 2020 11:21 AM IST

X
Telugu Gateway18 May 2020 11:21 AM IST
ఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 2282కు పెరిగింది. ఇందులో 1527 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 705 ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 9713 శాంపిళ్ళను పరీక్షించగా..52 కేసులు వెలుగుచూశాయి. కొత్తగా కృష్ణాలో 15, చిత్తూరులో 15, తూర్పు గోదావరిలో 5,కడపలో 2, కర్నూలులో 4,నెల్లూరులో 7,విశాఖపట్నం,విజయనగరంల్లో ఒక్కో కేసు, పశ్చిమ గోదావరిలో 2 కేసులు వెలుగుచూశాయి.
Next Story