Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు
X

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శాంపిళ్ళ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ తొలుత రోజుకు 80 లెక్కన నమోదు అయిన కేసులు..ఇటీవల వరసగా అరవైకి తగ్గాయి. తాజాగా అవి మరింత తగ్గినట్లు కన్పిస్తోంది. గడిచిన 24 గంటల్లో అంటే శనివారం నాడు కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఇదే సమయంలో మగ్గురు వ్యక్తులు కరోనా కారణం మరణించగా,45 మంది వ్యక్తులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తాజా గణాంకాలతో కలుపుకుంటే ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930కి పెరగ్గా, 887 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 999గా ఉన్నాయి. ఈ సారి చిత్తూరు జిల్లాలో కొత్తగా 11 కేసులు రాగా, కృష్ణాలో 16 కేసులు, అనంతపురంలో 3, గుంటూరులో 2, కర్నూలులో 6, విశాఖపట్నంలో 5 కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 8388 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపారు.

Next Story
Share it