అనంతపురం..వైజాగ్ ల్లో పెరిగిన కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ సారి అనంతపురంలో కొత్తగా 16, విశాఖపట్నంలో 11, పశ్చిమ గోదావరిలో 9 కేసులు వెలుగుచూశాయి. విజయనగరంలో మరో కేసు కూడా నమోదు అయింది. కర్నూలులో 7, కృష్ణాలో 6, గుంటూరులో 1, చిత్తూరులో 3 కేసులు వెలుగు చూశాయి. తాజాగా వచ్చిన 54 కేసులతో కలుపుకుంటే ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు పెరిగింది. ఇఫ్పటికే 842 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1004 మంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏపీలో ముగ్గురు మరణించారని హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది. కొత్తగా 7320 మంది శాంపిళ్ళను పరీక్షించగా..54 కేసులు వెలుగుచూశాయి. 547 కేసులతో కర్నూలు జిల్లా ఏపీలో అత్యధిక కేసులు ఉన్న ప్రాంతంగా నిలిచింది. 374 కేసులతో గుంటూరు రెండవ స్థానంలో ఉంది.