Telugu Gateway
Andhra Pradesh

ఐదేళ్ళ ‘అమ్మ ఒడి’ నిధులతో అద్భుతాలు చేయోచ్చు

ఐదేళ్ళ ‘అమ్మ ఒడి’ నిధులతో అద్భుతాలు చేయోచ్చు
X

రాష్ట్రంలో ‘శాశ్వత ఉచిత విద్య’ అందించవచ్చు

కానీ ‘శాశ్వత పంచుడు పథకాల’పైనే ఫోకస్

ఓట్ల కోసమే ఈ తిప్పలు అంటున్న అధికారులు

ప్రజాధనంతో ఓట్ల వేట

‘చంద్రబాబు ఎన్నికల ఏడాది ముందు మాత్రమే పంచుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐదేళ్లూ పంచుతా అంటున్నారు.’ ఇదీ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్య. నిజంగా డబ్బుల్లేక చదువుకోలేని వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. కాకపోతే ఎంత పేదరికంలో ఉన్నా ఎవరి వెసులుబాటును బట్టి వారు తమ పిల్లలను స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. కానీ ఏపీ సర్కారు అమ్మ ఒడి పథకం పేరుతో ఏటా 6500 కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి రెడీ అయింది. దీనికితోడు ఐదేళ్ళలో నాడు-నేడు కింద మరో 12000 కోట్ల రూపాయలతో మౌలికసదుపాయాల కల్పించటానికి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి రెండేళ్ల అమ్మ ఒడి నిధులు అంటే ఏకంగా 13 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన మౌలికసదుపాయాలు కల్పించటంతోపాటు...అత్యంత మెరుగైన సిబ్బందిని కూడా నియమించుకోవచ్చని ఈ రంగానికి చెందిన నిపుణుడు ఒకరు తెలిపారు. 13 వేల కోట్ల రూపాయలు కాకపోతే 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేసి అయినా రాష్ట్రంలోని విద్యార్ధులు అందరికీ ప్రభుత్వ పాఠశాల్లోనే అత్యంత మెరుగైన ఉచితంగానే విద్యాబోధన అందించవచ్చని తెలిపారు.నిజంగా చదువులేని వారికి చదువు చెప్పించటమే ఈ పథకం ఉద్దేశం అయితే ఈ మార్గాన్ని ఎంచుకోవాలి కానీ మీరు ఎక్కడైనా చదువుకోండి డబ్బులు మేమే కడతాం అనటం సరికాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అలా కాకుండా ఏటా 6500 కోట్ల రూపాయలు ఐదేళ్ల పాటు విద్యార్ధుల తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పటం అంటే కేవలం రాజకీయ కోణం తప్ప..విద్యా కోణం కాదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో విద్యాసౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన మెరుగుపర్చి ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పిస్తే సరిపోతుందని...అలా కాకుండా ప్రతి ఏటా విద్యార్ధుల తల్లిదండ్రులకు నగదు చెల్లించటం అంటేనే అసలు లక్ష్యం ఏమిటో అర్ధం అవుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఐదేళ్లకు గాను జగనన్న అమ్మ ఒడి అమలు కోసం 35 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతోంది. దీనికి తోడు నాడు-నేడు 12 వేల కోట్ల రూపాయలను కలుపుకుంటే మొత్తం 47 వేల కోట్ల రూపాయలు అవుతుంది. దీనికి తోడు పలు ఇతర పథకాల అమలు కు కోట్లాది రూపాయల వ్యయం చేస్తున్నారు.

కావాలంటే ప్రభుత్వమే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి అమ్మ ఒడి-నాడు నేడు నిధులతో ఏపీలో విద్యకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించవచ్చని..కానీ నేతలు మాత్రం శాశ్వత పరిష్కారం సంగతి పక్కన పెట్టి..రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ ధనాన్ని తామేదో ఇస్తున్నట్లు కలరింగ్ ఇఛ్చుకుంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని చెబుతున్నారు. నిజంగా డబ్బులున్న వారే చదువుతారు అనుకోవాలంటే సంపన్నుల పిల్లలు అందరూ అద్భుతమైన పొజిషన్లలో ఉండాలి. కానీ అలా ఎక్కడా జరగదు. అలాగని పేదలు చదవలేరు అనుకోవటానికి లేదు..ప్రభుత్వ బడుల్లో చదవిన వారు కూడా అద్భుత పొజిషన్లను అందుకున్న వారు ఉన్నారు. ఇది ఆయా పిల్లల శక్తి సామర్ధ్యాలు..తల్లితండ్రుల గైడెన్స్ వంటిపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనా ల కోసంఇలా ఖజనాపై ఇలా శాశ్వత భారం మోపటం సరికాదని చెబుతున్నారు.

Next Story
Share it