ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట
BY Telugu Gateway22 May 2020 5:09 PM IST

X
Telugu Gateway22 May 2020 5:09 PM IST
సస్పెన్షన్ కు గురైన సీనియర్ పోలీస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ ఆదేశాలను హైకోర్టు ఎత్తేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. వెంకటేశ్వరరావు రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది.
ఆయన నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. భద్రతా పరికరాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయనే అంశంపై ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Next Story