చంద్రబాబు..లోకేష్ ఏపీకెందుకు రావటంలేదు?

హైదరాబాద్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ రాష్ట్రానికి ఎందుకు రావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఇళ్లల్లో కూర్చొని దీక్షలు చేయడం సరికాదని, అధికారులను మానసికంగా దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లాక్‌డౌన్ వలన ప్రజలకు మేలు జరుగుతుంది కానీ సమాజానికి ఇబ్బంది అవుతుంది. కరోనా టెస్టులు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. ప్రభుత్వం పని తీరుకు ఇది నిదర్శనం. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. మీడియాలో ప్రచారం కోసం చంద్రబాబు రోజు సోది కబుర్లు చెపుతున్నారు. సీఎం జగన్‌కు పని చేయడం తప్ప ప్రచారం చేసుకోవడం రాదు.
నిమ్మగడ రమేష్ కేంద్ర హోమ్ శాఖకు పంపింది భయంకరమైన లేఖ. రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న వ్యక్తి పంపాల్సిన లేఖలా లేదు. కేంద్ర హోంశాఖకు పంపింది నిమ్మగడ రమేష్ రాసిన లేఖ కాదు. ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, పెన్ డ్రైవ్ నుంచి ఎందుకు ఆధారాలు ధ్వంసం చేశారు? ఆధారాలు లేకుండా చేయాల్సిన పరిస్థితి రమేష్‌కు ఎందుకు వచ్చింది. ఆధారాలు ధ్వసం చేయడం దేనికి సంకేతం. ఈ వ్యవహారంలో ఇంకా ఆధారాలు బైటకు రావాల్సి ఉంది. నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖ టీడీపీ కార్యాలయం నుంచి మీడియాకు ఎలా చేరింది. మీడియాకు కూడా నిమ్మగడ్డ రమేష్ లేఖ రాయలేదని చెప్పారు. నేషనల్ మీడియా కూడా రమేష్ లేఖ రాయలేదని చెప్పిందన్నారు.