ఏపీలో రెండు జిల్లాల్లోనే 252 కేసులు
BY Telugu Gateway17 April 2020 1:48 PM IST

X
Telugu Gateway17 April 2020 1:48 PM IST
రెండు జిల్లాలు. 252 కరోనా పాజిటివ్ కేసులు. ఇదీ ఏపీ పరిస్థితి. గుంటూరు జిల్లాలో 126 కేసులు..కర్నూలులో 126 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నాడు కొత్తగా రాష్ట్రంలో 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కొత్తగా వెలుగు చూసిన కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి బులిటెన్ విడుదల చేశారు.
గడచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు 6. అనంతపురం 5, చిత్తూరు 5, కృష్ణా 4 , గుంటూరు 4, కడప 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 523 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.
Next Story