Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 432కు పెరిగిన కరోనా కేసులు

ఏపీలో 432కు పెరిగిన కరోనా కేసులు
X

ఏపీలో తొలుత తగ్గినట్లే కన్పించిన కరోనా కేసులు మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్ వేగంగా పెరుగుతోంది. సోమవారం నాడు ఏపీలో కొత్తగా మరో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 432కి పెరిగింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో.. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైందని తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, ఏడుగురు మృతిచెందారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 413 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు.

Next Story
Share it