Telugu Gateway
Politics

భారత్ కు ట్రంప్ వార్నింగ్..ప్రతికారం ఉంటుంది

భారత్ కు ట్రంప్ వార్నింగ్..ప్రతికారం ఉంటుంది
X

కరోనా వైరస్ వ్యవహారం అమెరికా, భారత్ ల మధ్య చిచ్చు రాజేస్తోంది. కరోనా చికిత్సకు మంచి ఔషధంగా పనికొస్తుందని భావిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్ మందులను అమెరికా ఇప్పటికే 29 మిలియన్ల డోసులను నిల్వ చేసుకుంది. ఇది చాలదన్నట్లు ఇంకా తమకు ఆ మందులను ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారత్ ను కోరారు. తాము కోరినట్లు మందులు కావాలని....లేదంటే ప్రతీకారం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ఇఫ్పటికే ఈ మందుల ఎగుమతిపై ఆంక్షలు పెట్టింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతోపాటు అత్యధిక జనాభా కల దేశంలో ఎప్పుడు ఏ విపత్తు ఎధురైనా ఎధుర్కొనేందుకు వీలుగా ఈ మందుల ఎగుమతిపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ట్రంప్ కోపానికి కారణమైంది. తాను కోరినట్లు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాబ్లెట్లను భారత్ సరఫరా చేయకపోతే మాత్రం ఇది తమను ఆశ్చర్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు.

ప్రధాని మోడీతో మాట్లాడిన సమయంలో ఈ మందులు కావాలని కోరానని..అందుకు భారత్ నిరాకరిస్తే భారత్ పైప్రతీకారం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు. అమెరికాలో ప్రస్తుతం 3,68,196 కేసులు ఉండగా..మరణాలు మాత్రం 10,986కు చేరాయి. ఒక్క న్యూయార్క్ లోనే 1,31,815 కేసులు నమోదు అయ్యాయి. అయితే భారత్ మాత్రం హైడ్రాక్సీక్లోరోక్వీన్ తో పాటు కరోనాకు ఉపయోగపడతాయనే అన్ని మందులపై నిషేధం విధించింది. ఈ మందుల కోసం భారత్ పై వివిధ దేశాల నుంచి రకరకాల ఒత్తిళ్ళు వస్తున్నాయి. ట్రంప్ నిర్వాకం కారణంగానే అమెరికాలో కరోనా కేసులు ఈ స్థాయికి చేరాయనే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it