Telugu Gateway
Andhra Pradesh

ఏపీకి తెలంగాణ వార్నింగ్ ఇచ్చిందా?!

ఏపీకి తెలంగాణ వార్నింగ్ ఇచ్చిందా?!
X

కరోనా టెస్ట్ ల జాబితా నుంచి సడన్ గా తెలంగాణ మిస్సింగ్!

కరోనా టెస్ట్ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని చాలా రాష్ట్రాల కంటే ముందు ఉంది. సర్కారు విడుదల చేస్తున్న లెక్కలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఏపీ ప్రతి రోజూ హెల్త్ బులెటిన్ తో పాటు మీడియాకు ఏ రాష్ట్రంలో ఎన్ని టెస్ట్ లు చేస్తున్నారు..ఎక్కడెక్కడ ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయనే జాబితాను కూడా విడుదల చేస్తోంది. అందులో తెలంగాణ వివరాలు కూడా ఉన్నాయి. కానీ గత రెండు రోజులుగా ఏపీ విడుదల చేసే ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం మాత్రం ‘మిస్’ అయింది. దీనికి కారణం ఆ రాష్ట్రం నుంచి వచ్చిన వార్నింగే అని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మీ లెక్కలు మీరు చూసుకోండి..తెలంగాణ లెక్కల సంగతి మీకెందుకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కారణంగానే జాబితా నుంచి తెలంగాణ టెస్ట్ లను తొలగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాం ఏపీ అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది.

తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఆగ్రహం కారణంగానే రాష్ట్రాల వారీగా తయారు చేసిన సమ్మరీ జాబితా నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పించారని చెబుతున్నారు. ఏప్రిల్ 24 నాటికి ఏపీలో మొత్తం 54,341 టెస్ట్ లు జరిగితే, తెలంగాణలో మాత్రం 13,200 టెస్ట్ లుమాత్రం జరిగినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నాటికి ఏపీలో మొత్తం 61,266 కరోనా పరీక్షలు నిర్వహించగా..తెలంగాణాలోమాత్రం 13200 పరీక్షలు మాత్రమే నిర్వహించినట్లు ఆ నివేదికలో తెలిపారు. అదే ఏప్రిల్ 26,27 జాబితాల నుంచి అసలు తెలంగాణ రాష్ట్ర లెక్కలనే తీసేశారు. కాకపోతే ఏపీలో మాత్రం ఏప్రిల్ 26 నాటికి 68034 టెస్ట్ లు, ఏప్రిల్ 27 నాటికి 74551 టెస్ట్ లు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల టెస్ట్ ల వివరాలు అందులో పొందుపర్చారు కానీ..సడన్ గా జాబితా నుంచి తెలంగాణ మిస్ అవటం తెలంగాణ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన వార్నింగే కారణం అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it