Telugu Gateway
Politics

బాధ్యతలేని వ్యక్తులతో మేం మాట్లాడాలా? తలసాని

బాధ్యతలేని వ్యక్తులతో మేం మాట్లాడాలా? తలసాని
X

కాంగ్రెస్ పార్టీ విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. ప్రధాని మోడీ దేశంలోని ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారు..సీఎం కెసీఆర్ మాత్రం ఎందుకు ప్రతిపక్షాలతో చర్చించరని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై తలసాని సమాధానం ఇచ్చారు. కేసీఆర్ కరోనా నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నారని..ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరిస్తున్నారన్నారు. మంత్రి తలసాని వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘భాద్యతలు లేవి వ్యక్తులతో మేము మాట్లాడాలా?. ప్రజలు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడం లేదు. ప్రతిపక్షాలు అంటే మాకూ గౌరవమే. కొంతమంది దద్దమ్మలు గాలిమాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లనే సీఎం విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా కు ఇచ్చిన గౌరవం ఏంటో అందరికి తెలుసు. ప్రపంచ దేశాలు మెడిసిన్ ను ఇండియాను అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది.

విమర్శలు చేసే వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు. జ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తుంది. మీడియాలో కనిపించాలనే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు పనికిరాని దద్దమ్మలు. మంచి సూచనలు సలహాలు ఇవ్వండి తీసుకుంటాము. కొంతమంది జూనియర్ వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బ్యాచ్ కొంతమంది జూనియర్ వైద్యులు మాత్రమే ముగ్గురు నలుగురు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే వైద్యులు మాత్రమే విమర్శలు చేస్తున్నారు. యంత్రాంగం సరిగ్గా లేవని డోనేషన్ ఇచ్చే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్లకు ఇవ్వాలని స్టేట్మెంట్ ఇచ్చారు. కొంత మంది మాత్రమే యంత్ర పరికరాలు లేవని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎం జరుగుతుందో కాంగ్రెస్ నేతలు తెలుసుకుని మాట్లాడాలి. మర్కజ్ వెళ్లిన వాళ్ళను 24 గంటల్లోనే పట్టుకున్నారు’. అని తెలిపారు.

బా

Next Story
Share it