‘రెడ్’ విడుదల థియేటర్లలోనే
BY Telugu Gateway12 April 2020 1:30 PM GMT
X
Telugu Gateway12 April 2020 1:30 PM GMT
హీరో రామ్ తన కొత్త సినిమా ‘రెడ్’పై క్లారిటీ ఇచ్చేశాడు. తన సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుందని..ఇందులో ఎలాంటి సందిగ్ధం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించాడు. వాస్తవానికి ఏ సినిమా ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండటంతో సినిమాలు అన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు.
అభిమానులు ‘రెడ్’ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు రామ్’ అని తెలిపాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటించారు. స్రవంతి మ´వీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.
Next Story