Telugu Gateway
Telangana

ప్రజా రవాణా ఇప్పటికిప్పుడు కష్టమే

ప్రజా రవాణా ఇప్పటికిప్పుడు కష్టమే
X

గ్రీన్ జోన్లలోనే వెసులుబాట్లు

ప్రధాని నరేంద్రమోడీ మే 3 తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు. తెలంగాణ సీఎం కెసీఆర్ మే 7 తర్వాత అయినా లాక్ డౌన్ ఎత్తేస్తారా?. ఏపీ సీఎం జగన్ మాత్రం కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే సై అనే మూడ్ లో ఉన్నారు. ఈ తరుణంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రజా రవాణా మాత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశంలేదని సంకేతాలు ఇఛ్చారు. లాక్ డౌన్ తో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారి రైళ్లు పట్టాలు ఎక్కి..బస్సులు రోడ్డెక్కితే లక్షలాది మంది తమ తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్లిపోవాలా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇళ్ళలో ఉన్న వారంతా బయట ఎప్పుడు అడుగుపెడదామా అని చూస్తుంటే...లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వారు మాత్రం ఇంటికి ఎప్పుడు వెళదామా అన్న మూడ్ లో ఉన్నారు.

అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే మాత్రం కనీసం మే నెలాఖరు వరకూ కూడా ప్రజా రవాణా ఉండదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఆయన మాత్రం గ్రీన్ జోన్లలో మాత్రం ఆంక్షలు ఎత్తేసే అవకాశం ఉందని తెలిపారు. కిషన్ రెడ్డి బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఢిల్లీల్లో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారని తెలిపారు. మరింత విస్తృత సంప్రదింపుల తర్వాతే కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..రాష్ట్రాలు తమ దగ్గరి పరిస్థితులను బట్టి నిర్ణయాల్లో మార్పులు చేసుకోవచ్చని తెలిపారు.

Next Story
Share it