Telugu Gateway
Politics

లాక్ డౌన్ విఫలమైతే ప్రత్యామ్నాయ వ్యూహం ఉందా?

లాక్ డౌన్ విఫలమైతే ప్రత్యామ్నాయ వ్యూహం ఉందా?
X

దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాక్ డౌన్ పొడిగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ లాక్‌డౌన్‌ సత్పలితాలను ఇవ్వకపోతే ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ప్రశాంత్‌ కిషోర్‌... ‘‘ లాక్‌డౌన్‌పై చర్చ ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే వాస్తవం ఏమిటంటే... ఒకవేళ లాక్‌డౌన్‌ వల్ల ఆశించిన ఫలితం రానట్లయితే మే 3 తర్వాత ఏం జరగబోతోంది.

ఆ తప్పిదాన్ని సరిచేయడానికి మన దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా’’అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. తొలిసారిగా మార్చి 24 అర్ధరాత్రి విధించిన లాక్‌డౌన్‌ సరైందేనన్న ప్రశాంత్‌ కిషోర్‌.. దానిని పొడిగించే అవకాశాలు ఉన్నాయని గతంలోనే పేర్కొన్నారు. అయితే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌ సన్నద్ధంగా ఉందా అన్న సందేహాలను లేవనెత్తారు.

Next Story
Share it