Telugu Gateway
Politics

అందరి చూపూ మోడీ వైపు

అందరి చూపూ మోడీ వైపు
X

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఉదయం పది గంటలకు ఏమి చెబుతారు?. లాక్ డౌన్ ఆంక్షలు సులభతరం చేస్తారా?. లేక మరింత కఠిన తరం చేస్తారా?. పారిశ్రామిక రంగానికి ఏమైనా మినహాయింపులు ఇస్తారా?. ఎయిర్ లైన్స్ గాల్లోకి ఎగురుతాయా?. విమానాలన్నీ ఏప్రిల్ 30 వరకూ అలా విమానాశ్రయ పార్కింగ్ ప్రాంతాలకే పరిమితం అవుతాయా?. రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఏమైనా సడలింపులు వస్తాయా. దేశంలోని ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం దేశ ప్రజల ప్రాణాలతోపాటు ఆర్ధిక వ్యవస్థను కూడా చూడాల్సిన అవసరం ఉందని మోడీ వ్యాఖ్యానించారు.

కరోనా దెబ్బకు దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఈ దెబ్బకు దేశ వృద్ధి రేటు ఎన్నడూలేని స్థాయిలో పతనం కానుందని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ప్రధాని తర్వాత మంత్రుల సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో చర్చించారు. మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. దేశంలో కరోనా కేసుల వేగం పెరుగుతుండటంతో లాక్ డౌన్ కొనసాగింపు అనివార్యం అని తేలిపోయింది. అయితే ఎవరెవరికి మినహాయింపులు, వెసులుబాట్లు లభించనున్నాయనే అంశమే ఇప్పుడు తేలాల్సి ఉంది.

Next Story
Share it