మాస్క్ లు లేకుండా రోడ్లపై నారా లోకేష్..దేవాన్ష్
BY Telugu Gateway18 April 2020 5:19 PM IST

X
Telugu Gateway18 April 2020 5:19 PM IST
టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలు ఉల్లంఘించారు. హైదరాబాద్ లోని తన ఇంటి రోడ్డుపై మాస్క్ లు లేకుండా లోకేష్ సైకిల్ తొక్కారు. లోకేష్ సైకిల్ తొక్కటమే కాకుండా తన తనయుడు నారా దేవాన్ష్ స్కేట్ బోర్డుపై హంగామా చేశారు. వీళ్లిద్దరి పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రం మాస్క్ ధరించి ఉన్నాడు. కానీ వీళ్లు మాత్రం మాస్క్ లు లేకుండానే రహదారిపై సరదాగా తిరిగారు.
దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో బయటకు వస్తే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని సర్కారు ఆదేశించింది. కానీ బాధ్యత గల మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలా చేయటం ఏమిటంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story