Telugu Gateway
Cinema

మోసగాళ్లు విడుదల ఎప్పుడో చెప్పిన విష్ణు

మోసగాళ్లు విడుదల ఎప్పుడో చెప్పిన విష్ణు
X

కరోనా సమయం ఇది. కొత్త సినిమాలు లేక ప్రేక్షకులు కూడా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ఉంది. మరి ఈ నెలలో కొత్త సినిమాలు అసలు విడుదల అవుతాయా..లేదా అన్న అంశంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఎందుకంటే లాక్ డౌన్ తొలగిస్తారా లేక కొనసాగిస్తారా? అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో హీరో మంచు విష్ణు తమ ‘మోసగాళ్ళు’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు.

ఈ సినిమాలో విష్ణుకు జోడీగా కాజల్ నటిస్తుండగా..మరో కీలక పాత్రలో సునీల్ శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను జూన్ 5న, ఇంగ్లీష్ వెర్షన్ ను జూలైలో విడుదల చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. అతి పెద్ద ఐటి కుంభకోణం నేపథ్యంలో సాగిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జెఫ్రి గి చిన్. హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసిన ఓ భారీ ఐటి ఆఫీస్ సెట్ లో చిత్రీకరణ మెజారిటీ భాగం పూర్తి కావటంతో విడుదల తేదీని ప్రకటించినట్లు మంచు విష్ణు వెల్లడించారు.

Next Story
Share it