Telugu Gateway
Politics

ఏప్రిల్ ఐదున కరోనా చీకట్లను తరిమేయాలి

ఏప్రిల్ ఐదున కరోనా చీకట్లను తరిమేయాలి
X

ప్రధాని నరేంద్రమోడీ కరోనాపై పోరుకు సంబంధించి శుక్రవారం నాడు కొత్త కార్యక్రమం ప్రకటించారు. దేశమంతటా ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు లైట్లను ఆపేయాలని కోరారు. అదే సమయంలో కొవ్వొత్తులు లేదా సెల్ ఫోన్ లైట్లను వెలిగించాలని కోరారు. ఎవరు ఎక్కడ ఉన్నా ఈ పని చేయాలి. ఈ కార్యక్రమంలో భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు అందరిలో ఇది స్పూర్తి నింపాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ శుక్రవారం దేశప్రజలనుద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.

కరోనాపై యుద్ధానికి ప్రజలు బాగా సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొట్టాలి. మనం ఒంటరి కాదు అనే భావన కల్పించాలి. దేశ ప్రజలు సంకల్ప శక్తని చాటాలి. తొమ్మిది నిమిషాల సమయం నాకివ్వండి. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లే. రాబోయే ఊదు రోజులు అత్యంత కీలకం. మీరు వెలిగించే దీపాలు స్పూర్తినివ్వాలి. అందరం కలసి కరోనాను తరిమేద్దాం. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తాం. కరోనాపై పోరు విషయంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలు అన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలి’ అని మోడీ కోరారు.

Next Story
Share it