Telugu Gateway
Andhra Pradesh

కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు

కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు
X

252కు పెరిగిన ఏపీలో మొత్తం కేసులు

ఏపీలో కొత్త కరోనా కేసుల నమోదులో స్పీడ్ ఏ మాత్రం ఆగటం లేదు. ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో ఒక్క కర్నూలులోనే 26 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కర్నూలు జిల్లాలో నమోదు అయిన కేసుల సంఖ్య 53కు పెరిగింది. ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరిపిన పరీక్షల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది. కొత్తగా నమోదు అయిన 26 కేసులతో కలుపుకుంటే ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు పెరిగింది. ఏపీలో ఇఫ్పటివరకూ ఆరుగురు పేషెంట్లు రివకరి అయిన డిశ్చార్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఇఫ్పటివరకూ నమోదు అయిన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వారు పదకొండు మంది అయితే..వారి కాంటాక్ట్స్ ఆరుగురు, వైరస్ లక్షణాలతో చేరిన వారు మరో ఆరుగురు ఉన్నారు.

అంటే 23 మంది మాత్రమే విదేశీ లింక్ తో కూడిన కరోనా కేసులు. .అంటే మిగిలిన 229 మంది ఢిల్లీ మర్కజ్ సమావేశానికి వెళ్లిన వారు..వారి కాంటాక్ట్స్ మాత్రమే అని స్పష్టం అవుతోంది. కర్నూలు తర్వాత అత్యధిక కేసులు నెల్లూరు జిల్లాలో 34 ఉండగా, గుంటూరులో 30, కృష్ణాలో 28, ప్రకాశంలో 23, చిత్తూరులో 17, విశాఖపట్నంలో 15, పశ్చిమ గోదావరిలో 15, కడపలో 23 కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరిలో మాత్రం 11 కేసులు ఉన్నాయి.

Next Story
Share it