Telugu Gateway
Telangana

ఉద్యోగులను తొలగించొద్దు..కెటీఆర్ లేఖ

ఉద్యోగులను తొలగించొద్దు..కెటీఆర్ లేఖ
X

కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని రంగాలు, ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటీఆర్ తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణలోని ప్రైవేట్ రంగం ఎన్నో సేవా కార్యక్రమాలతోపాటు పేదలకు సాయం చేస్తున్నాయని కొనియాడారు. ముఖ్యమంత్రి కెసీఆర్ సారధ్యంలో అన్ని అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్లిష్ట సమయంలో రాష్ట్రంలోని పరిశ్రమల ఉత్పత్తి తగ్గిపోవటంతోపాటు ఆదాయాలు తగ్గిపోయాయని, మార్కెట్ కూడా క్షీణించిందని తెలిపారు. ఐటీ సంస్థలు, తెలంగాణలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న పర్మినెంట్, తాత్కాలిక ఉద్యోగులను తొలగించవద్దని ఆయా సంస్థల యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

ప్రభుత్వ తరపున లేఖ రాస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఈ సంక్షోభం నుంచి బయటపడతామని తాను నమ్ముతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉద్యోగులను తొలగించే బదులు కంపెనీలు ఇతర మార్గాల్లో వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ఇందుకు వేతనాల్లో కోత, ఇంక్రిమెంట్లు, బోనస్ లను వాయిదా వేయటం వంటి మార్గాలను అనుసరించాలన్నారు. తెలంగాణ సర్కు కూడా ఉద్యోగులకు ఇలాగే చేసిందని తన లేఖలో పేర్కొన్నారు.

.

Next Story
Share it