పెళ్లి వార్తలను ఖండించిన కీర్తి సురేష్
BY Telugu Gateway5 April 2020 2:47 PM IST
X
Telugu Gateway5 April 2020 2:47 PM IST
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్ళీ పీటలు ఎక్కనున్నారనే వార్తలు తాజాగా హల్ చల్ చేశాయి. ఓ బిజెపి నేత, వ్యాపార ప్రముఖుడి కుమారుడితో కీర్తి పెళ్ళి ఖరారు అయిందని...ఈ సంవత్సరాంతంలో వివాహం జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కీర్తి సురేష్ ఖండించారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం అన్నారు. మరో ఏడాది వరకూ కాల్షీట్లు ఇచ్చానని.ఈ దశలో పెళ్లి ఎలా చేసుకుంటానని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించవద్దని కోరారు.
Next Story