కర్నూలులో 82..గుంటూరులో 75 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 24 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకూ జరిపిన పరీక్షల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక్క గుంటూరులోనే శనివారం నాడు 17 పాజిటివ్ కేసులు రాగా, కర్నూలులో 5, ప్రకాశం, కడపల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. కొత్తగా వచ్చిన 24 కేసులు కలిపితే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల మొత్తం 405కు చేరింది. కర్నూలు జిల్లా ఏపీలోనే అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 82 పాజిటివ్ కేసులు ఉండగా, 75 కేసులతో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచింది.
నెల్లూరులో 48, ప్రకాశంలో 41, కృష్ణాలో 35, కడపలో 30, చిత్తూరులో 20, అనంతపురంలో 15, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరిలో 22, తూర్పు గోదావరిలో 17 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఒక్క పేషంట్ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు, ఈ 28 సంవత్సరాల యువకుడు విజయవాడకు చెందిన వ్యక్తి. స్వీడన్ నుంచి వచ్చి వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో మొత్తం పదకొండు మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు అయింది. ప్రస్తుతం ఆష్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 388గా ఉంది.