Telugu Gateway
Telangana

మర్కజ్ కు వెళ్లిన 160 మంది ఇంకా దొరకాలి

మర్కజ్ కు వెళ్లిన 160 మంది ఇంకా దొరకాలి
X

ఢిల్లీలోని నిజాముద్దదీన్ మర్కజ్ కు వెళ్లిన వారిలో ఇంకా 160 మందిని గుర్తించాల్సి ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వెయ్యికి మందికిపైగా మర్కజ్ కు వెళ్లినట్లు సమాచారం ఉందని అన్నారు. కరోనా వైరస్ కట్టడికి దేశంలోనే అత్యంత పకడ్భందీగా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఈటెల పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాలు మొదట రద్దు చేయాలని కోరింది ముఖ్యమంత్రి కెసీఆరే అని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణ అన్నారు.

మర్కజ్ గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చింది కూడా తెలంగాణానే అని..కేంద్రం ఇంకా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈటెల ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే మర్కజ్ కు వెళ్ళిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించామంటే తెలంగాణ ప్రభుత్వ సత్తా, చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవాలన్నారు తెలంగాణలో వైరస్ కమ్యూనిటి ట్రాన్స్ ఫర్ జరగలేదన్నారు. బుధవారం గాంధీ నుంచి మరో ఇద్దరు డిశ్చార్జి అవుతారని..డిశ్చాజ్ అయిన వారు కూడా 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటారని మంత్రి తెలిపారు. గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో మరో పది మందికి నెగిటివ్ వచ్చిందని తెలిపారు.

Next Story
Share it