అల్లు అర్జున్ కోసం..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8న. ఈ హీరో అల...వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే జోష్ లో కొత్త సినిమాకు కూడా రెడీ అయిపోయాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజుకు చాలా ముందుగానే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆయన అభిమానుల కోసం ఓ కామన్ డిస్ ప్లే పిక్చర్ ను విడుదల చేశారు. అందులోనే కరోనా వైరస్ కు సంబంధించి స్టే సేఫ్..స్టే హోమ్ అంటే నినాదాన్ని కూడా పెట్టారు.
అది ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ అభిమానులు అందరూ దీన్ని షేర్ చేస్తున్నారు. ‘నా ప్రియమైన స్నేహితుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సీడీపీని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే బన్నీ బాయ్. బర్త్ డే రోజు మరోసారి విష్ చేస్తాను’ అని దేవీశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నది దేవిశ్రీ ప్రసాదే.