Telugu Gateway
Telangana

తెలంగాణ కరోనా కేసులు@1001

తెలంగాణ కరోనా కేసులు@1001
X

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తోంది. ఆదివారం నాడు రాష్ట్రంలో కొత్తగా 11 కేసులు నమోదు కాగా...ఆ కేసులు అన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం మరో విశేషం. తాజాగా వచ్చిన 11 కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1001కు పెరిగింది. ఆదివారం నాడు తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 660 ఉన్నాయని సర్కారు హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

రాష్ట్రంలోనే అత్యధిక కేసులు, మరణాలు కూడా జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 540 అయితే..మరణాలు 18గా నమోదు అయ్యాయి. ప్రస్తుతం నగరంలో 371 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక కేసులు ఉన్న ప్రాంతం సూర్యాపేట. ఇక్కడ 83 కేసులు ఉన్నాయి. నిజామాబాద్ లో 61 కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం నాడు మర్కజ్ కు వెళ్ళొచ్చిన కాంటాక్ట్ 75 సంవత్సరాల వ్యక్తి కోలుకుని డిశ్చార్జి అయ్యాడని తెలిపారు.

Next Story
Share it