ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లేనా?

కొత్తగా పది కేసులు..మొత్తం 314
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందా?. గత కొన్ని రోజుల స్పీడ్ కూ..మంగళవారం నాటి పరిస్థితికి మాత్రం తేడా స్పష్టంగా కన్పిస్తోంది. మంగళవారం ఉదయం, సాయంత్రం కలుపుకుని వెల్లడైన కేసులు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరిగిన కోవిడ్ 19 పరీక్షల్లో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అందులో గుంటూరులో ఎనిమిది ఉండగా, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కే కేసు నమోదు అయ్యాయి.
తాజాగా వచ్చిన పది కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 314కు పెరిగింది. గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య 41కు పెరిగింది. నెల్లూరులో 43, కర్నూలులో 74 కేసులు ఉన్నాయి. కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వెంటిలేటర్స్ ను రాష్ట్ర, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు.