Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

కరోనా జ్వరం లాంటిదే…ఎవరూ భయపడొద్దు

0

ఇది క్యూరబుల్..మందు తీసుకుంటే తగ్గుతుంది

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అనూహ్యంగా పెరగటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో ఓ  సమావేశానికి హాజరైన వారి వల్లే రాష్ట్రంలో కేసులు పెరిగాయని..అయినా ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. కరోనా వైరస్ వస్తే ఏదో ప్రతిష్టకు మచ్చగా భావించాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా క్యూరబుల్ అని..మందులు తీసుకుంటే తగ్గిపోతుందని అన్నారు. తర్వాత జ్వరం వచ్చి తగ్గాక ఎలా తిరుగుతామో అలా తిరగొచ్చన్నారు. కరోనా వైరస్ సోకిన వారిని చూసి ఎవరూ జాలి పడాల్సిన అవసరం లేదని..వాళ్లపై ఎవరూ వివక్ష చూపించకూడదని కోరుతున్నట్లు జగన్ తెలిపారు. జగన్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడిన వాటిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…‘ ఈ కరోనా  వైరస్ కూడా ఒక జ్వరం..ఫ్లూలాంటిదే. కాకపోతే పెద్ద వయస్సు వాళ్లపై..బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్న వారిపై మామూలు జ్వరంకన్నా తీవ్రంగా ఉంటుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వారిపై కూడా. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..అధైర్యపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ ఈజీగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కరోనా వైరస్ ప్రధానులు, దేశాధినేతలు, వాళ్ల కుటుంబ సభ్యులకూ వచ్చింది. వచ్చి నయం అయి.. వాళ్లు తిరుగుతున్నది కూడా  మన కళ్ల ముందు కన్పిస్తుంది.

- Advertisement -

రాష్ట్రంలో రెండు రోజులుగా కరోనా వైరస్ పెరుగుతంది. వైరస్ సోకటం ఓ పాపంగా..తప్పుగా చూడొద్దు. అలా భావించవద్దని విజ్ణప్తి చేస్తున్నాను. ఢిల్లీలో ఓ సమావేశానికి వెళ్లిన పరిస్థితిలో..అక్కడ చాలా మంది విదేశీయులు కూడా వచ్చారు. మన వాళ్లు అక్కడికి వెళ్లటం..అక్కడ వైరస్ వీళ్లకు సోకినట్లుగా కన్పిస్తోంది. రాష్ట్రంలో ఈ రోజుకు దాదాపు 87 కేసులు నమోదు అయితే…70  కేసులు కేవలం ఢిల్లీ నుంచి ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ కాంటాక్ట్ అయినందున వల్ల వచ్చినవే. ఇది గమనించాల్సిన అంశం. మన లెక్కల ప్రకారం 1085 మంది ఆ మీటింగ్ కు వెళ్ళారు ఢిల్లీకి. అందులో ఇప్పటికే దాదాపు 585 మందికి టెస్ట్ చేయటం జరిగింది. 70 కేసులు పాటిజివ్ గా రావటం జరిగింది. మరో 500 కేసులు టెస్టింగ్ లో ఉన్నాయి. ఇంకా 21 మందిని గుర్తించాలి. జాడలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. జాడ తెలియదు. నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే. వీళ్లు కానీ..వీళ్ల కుటుంబ సభ్యులు కానీ ..సన్నిహితంగా మెలిగిన వారు మీ అంతటే మీరే 104కి ఫోన్ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

కరోనా  స్టిగ్మా కాదు…జర్వంలాంటిదే…వస్తుంది. నయం చేయించుకుని ఇంటికి కూడా వెళ్లిపోవచ్చు. ఓ పధ్నాలుగు రోజులు వైద్యం కోసం ఐసోలేషన్ లో పెట్టి నయం చేసి ఇళ్లకు పంపిస్తారు. ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే రాష్ట్రమంతటా గ్రామ వాలంటీర్లు, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు,,స్థానికంగా అందుబాటులో ఉన్న ఆర్ పీలను  కూడా యాడ్ చేశాం. ప్రతి ఇంటికి వచ్చి ప్రజల బాగోగుల మీద సర్వే చేస్తున్నారు.. ఎవరికి గొంతు నొప్పి, జలుబు, జ్వరం ఉన్నా..ఊపిరి పీల్చుకోవటం సమస్య ఉన్నా వాళ్లకు చెపితే వైద్యం అందించే కార్యక్రమాలు కూడా చేస్తారు. 81 శాతం కేసులు ఇళ్లలో ఉండి వైద్యం చేయించుకుని బయట తిరుగుతున్నారు. ఇది చాలా చిన్నవిషయం. కేవలం 14 శాతం ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితులు. 4-5 శాతం కూడా ఐసీయూలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న  కేసులు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. వైద్యం చేయించటమే కాకుండా..నయం కావటానికి మందులు ఇస్తారు..ప్రతి రోజూ సూపర్ వైజ్ చేస్తారు. అన్ని రకాలుగా తోడుగా ఉంటారు. ఆరోగ్యం విషమిస్తే ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుతారు. ఎవరూ మొహమాట పడకుండా వాళ్ళకు చెప్పిండి. తమ ఆరోగ్య సమస్యలు చెప్పటం కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల వాళ్లకు కూడా మేలు జరుగుతుంది. అన్ని ప్రైవేట్ ఆస్పత్రులుకు విజ్ణప్తి చేస్తున్నా, మెడికల్ కాలేజీలకు కూడా.  మీరంతా కూడా ఈ సంక్షోభ సమయంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నా. అందరూ మనస్పూర్తిగా ముందుకు రావాలి. ఆదాయ వనరులు కూడా దాదాపు గా మందగించే పరిస్థితిలో ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులో ఉన్నారు.

కాబట్టి ప్రజలకు మరింత తోడ్పాటు అందించటం వల్ల..అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీని  వల్ల రాష్ట్ర  ఆర్ధిక పరిస్థితిపై భారం పడింది. అయినా కూడా వాళ్ల వాళ్ల జీతాలను పోస్ట్ పోన్ చేసుకుని ప్రభుత్వానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్,  ఐఎఫ్ ఎస్, ఉద్యోగులందరికీ..కష్టమన్పించినా..పెన్షనర్లకు కూడా  జీతాల వాయిదా వేసే అవకాశం ప్రభుత్వానికి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నా. రైతులు, రైతు కూలీలు, ఆక్వా రంగంలో ఉన్న  వారికి కొన్ని కొన్ని సలహాలు చెప్పాలి. గ్రామాల్లో మీ మీ పనులు చేసుకోవటానకి ఒంటి గంట వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. రైతు, రైతు కూలీలు బతకాలి.. ఆక్వా రంగం బతకాలి. ఒంటి గంట వరకూ పనులు చేసుకోవచ్చు. పనులు చేసుకునేటప్పుడు మీటర్ దూరం పెట్టుకోండి. ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ లేదు. ’ అని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.