వైసీపీ నేత చంద్రమౌళి మృతి
BY Telugu Gateway17 April 2020 10:00 PM IST

X
Telugu Gateway17 April 2020 10:00 PM IST
రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి శుక్రవారం నాడు హైదరాబాద్ లో మరణించారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చంద్రమౌళి రెండుసార్లు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 2014, 2019 ఎన్నికల బరిలో నిలిచారు.
Next Story