Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు వ్యాఖ్యలు..టీడీపీలో కలకలం!

చంద్రబాబు వ్యాఖ్యలు..టీడీపీలో కలకలం!
X

‘ప్రధాని నాకు ఫోన్ చేశారు. నేను ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా. నేను ముందు రోజు ప్రధాని కార్యాలయానికి (సోమవారం రాత్రి) ఫోన్ చేసి మోడీతో మాట్లాడాలని చెప్పా. ప్రధానే నాకు మంగళవారం ఉదయం ఫోన్ చేశారు’ ఇవీ చంద్రబాబు మంగళవారం నాడు వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు క్యాడర్ ను కూడా నిశ్చేష్టులను చేశాయి. మామూలు రోజుల్లో అయితే చంద్రబాబు తాను ప్రధానికి సలహాలు ఇచ్చానని చెప్పేవారు...కానీ ఈ సారి మాత్రం ‘ఆలోచనలు పంచుకున్నాం’ అనే పద ప్రయోగం చేశారు. అయినా పధ్నాలుగు సంవత్సరాలకుపైగా పనిచేసిన ఓ ముఖ్యమంత్రి, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తనకు ప్రధాని మోడీ ఫోన్ చేస్తే ఆ విషయం విలేకరుల సమావేశంలో చెప్పుకోవాలా?. అది కూడా చంద్రబాబు ఫోన్ చేస్తే ఆయన స్పందించారు తప్ప..ప్రధాని మోడీ తనంతట తానుగా చంద్రబాబుకు ఫోన్ చేసి కరోనా నివారణ చర్యలకు సలహాలు ఏమీ అడగలేదు.

రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరైనా నాకు ప్రధాని ఫోన్ చేశారనో..ముఖ్యమంత్రి ఫోన్ చేశారని చెప్పుకోవటం వరకూ అయితే ఓకే. అలాంటి వారు చెప్పటాన్ని కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు లాంటి సెల్ఫ్ క్లెయిమ్డ్ దేశ సీనియర్ నేత ఇలా చెప్పుకోవటం ఏంటి?. చంద్రబాబు విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన పరువు ఆయనే తీసుకున్నట్లు ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. చాలా మంది టీడీపీ నేతలు కూడా ఈ పరిణామంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు తాపత్రయం చూస్తుంటే తాను ఇంకా ప్రధాని మోడీతో టచ్ లో ఉన్నాననే సంకేతం పంపాలనుకున్నట్లు కన్పిస్తోందని ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it